పడకేసిన ప్రధాన మంత్రి సడక్ యోజన ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 14 December 2022

పడకేసిన ప్రధాన మంత్రి సడక్ యోజన !


ప్రధాన మంత్రి గ్రామ్ సేవక్ సడక్ యోజన మొదటి దశ, రెండవ దశ కింద దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్మాణం కావాల్సిన 4,236 రోడ్లు, వంతెనలు మూడేళ్లుగా పెండింగులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఇవి ఈ యేడాది సెప్టెంబరులోగానే పూర్తి కావాలని, అయితే భూసేకరణ, అటవీ శాఖ నుంచి అనుమతులు, నిర్మాణ సంస్థల లోపాల కారణంగా ఈ పనులు పూర్తి కాలేదని విపక్షలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ లోక్ ‭సభలో  సమాధానం ఇచ్చింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కఠినమైన భూభాగాలు, తక్కువ పని కాలం వంటి సమస్యల వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో కొండలు గల రాష్ట్రాలలో ఈ పనులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణంలో జాప్యానికి ఇది ప్రధాన కారణమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ దిగువ సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పీఎంజీఎస్‭వై-1 కింద 2,819 రోడ్లు (9,907 కి.మీ పొడవు), 920 వంతెనలు నిర్మించాల్సి ఉందని.. అలాగే పీఎంజీఎస్‭వై-2 కింద 400 రోడ్లు (1,132 కి.మీ పొడవు), 97 వంతెనలు పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ వివరణలో గ్రామీణ రహదారి అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశమని, అందువల్ల రోడ్ల నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టాలని అన్నారు. జమ్మూ-కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గరిష్ట సంఖ్యలో ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి అన్నారు.

No comments:

Post a Comment