శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించనున్న రాష్ట్రపతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలానికి ఈ నెల 26వ తేదీన రాష్ట్రపతి రాబోతున్నారు. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో శ్రీశైలం చేరుకుంటారు. అక్కడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్లని దర్శించుకొని, ఆ తర్వాత కేంద్ర టూరిజంశాఖ ద్వారా శ్రీశైలం దేవస్థానం చేపట్టిన ప్రసాదం స్కీమ్ పనులను ప్రారంభించనున్నారు. 28వ తేదీన తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. రామప్పను సందర్శించేందుకు విచ్చేయనున్న రాష్ట్రపతి, రామప్ప అభివృద్ధి కోసం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)