తేనీరు - అనర్ధాలు !

Telugu Lo Computer
0


ప్రతిరోజు ఉదయం, సాయంత్రం టీ తాగనిదే చాలా మందికి ఏమీ తోచదు. మసాలా టీ, అల్లం టీ, బాదం టీ, ఇరానీ ఛాయ్ ఇలా ఎన్నో రకాల తేనీరు లభిస్తుంది. అయితే, కొందరు ఐదేసి కప్పులకు మించి కూడా  తాగుతుంటారు. చలి కాలంలో ఈ ధోరణి అధికంగా ఉంటుంది. టీని మితంగా తీసుకుంటేనే మనకు లాభం. టీని అధికంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీలో సాధారణంగా కెఫిన్ ఉంటుంది. టీని ఎక్కువగా తీసుకునే వారు ఆందోళన, ఆత్రుతతో బాధపడతారు. శరీరంలో కెఫిన్ అధికంగా చేరితే మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలూ ఎదురవుతాయి. అలాగే, నిద్రలేమి సమస్యలతోనూ బాధపడాల్సి ఉంటుంది. టీలోని థియోఫిలిన్ అనే పదార్థం మన జీర్ణ వ్యవస్థకు నష్టం చేకూర్చుతుంది. టీని అధికంగా తీసుకుంటే మలబద్ధక సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హృదయనాళ వ్యవస్థకు కెఫిన్ నష్టాన్ని చేకూర్చుతుంది. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు, చికిత్స తీసుకుని కోటుకుంటున్నవారు టీకి దూరంగా ఉండాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)