దేవుడు ఈడీ రూపంలో నాకు మేలు చేసినట్లే !

Telugu Lo Computer
0


నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి తనకు వచ్చిన అవకాశమని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఆస్తుల ఎటాచ్‌మెంట్‌పై స్పందించారు. వాహనాలు అమ్మిన అశోక్‌ లేలాండ్‌ను ఆలస్యంగానైనా ఇందులో చేర్చడం సంతోషకరమన్నారు. లారీలను అమ్ముకోవాలనే ఉద్దేశంతో స్క్రాప్‌  అని రాసి ఏజెంట్లకు స్క్రాప్‌ లేకుండా ఇచ్చి, ఇన్‌వాయిస్‌ తమకు ఇచ్చారన్నారు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా వారు ఆ సంస్థను అడిగే పరిస్థితిలో లేరని చెప్పారు. ఇప్పటికీ వారు నాగాలాండ్‌లో ఏజెంట్లను గానీ, అశోక్‌లేలాండ్‌ను గానీ కేసులో చేర్చలేదని, అదెందుకో తెలియదన్నారు. 'ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నా. నాకు ఎలాంటి పేపరు రాలేదు. ప్రెస్‌ రిలీజు అని ఈడీ వారి ప్రకటన విడుదల చేశారు. నా దగ్గర ఏమీ లేదు. ఈడీకి నమస్కారం పెట్టుకుంటున్నా' అని రెండు చేతులు ఎత్తి మొక్కారు. తాడిపత్రి, నాగాలాండ్‌ ఆర్టీఓ కార్యాలయ అధికారులతో పాటు ఏజెంట్లు, చాలామంది పోలీసులు ఇందులో ఇరుక్కుంటారని పేర్కొన్నారు. 'ఈడీ అంటే ఆషామాషీ కాదు. కచ్చితంగా నాకు చాలా సాయం చేస్తోంది. రూ.33 కోట్లు అశోక్‌ లేలాండ్‌కు కట్టాం. వైట్‌మనీ, ట్యాక్స్‌ ఇతరత్రా కలిపి మొత్తం రూ.38.36 కోట్లు అని ఈడీ రిలీజు చేసిన ప్రెస్‌రిపోర్టు చూశా. ఇప్పుడు కచ్చితంగా ఎవరికి ఎన్ని వాహనాలు ఉన్నాయో తెలుస్తుంది. ఇదో మంచి తరుణం' అని చెప్పారు. 'అశోక్‌లేలాండ్‌ మాకు బండ్లు అమ్మకపోతే ఈ స్కాం అన్నమాటే రాదు. దేవుడు ఈడీ రూపంలో నాకు మేలు చేసినట్లే. ఏమీ లేకున్నా పోలీసులు తప్పుడు కేసులో నన్ను జైలుకు పంపారు. ఈడీ విచారణ వల్ల నేను తప్పు చేయలేదని తెలుస్తుంది' అని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)