అది నా ఆశయం కాదు !

Telugu Lo Computer
0


ఆనంద్ మహీంద్రను విక్రాంత్ సింగ్ అనే ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ''భారతదేశ అత్యంత సంపన్నుల జాబితాలో మీ పేరు 73వ స్థానంలో ఉంది. అగ్రస్థానానికి ఎప్పుడు చేరుకుంటారు?'' అని నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి ఆనంద్ మహీంద్ర సమాధానం చెబుతూ ''నిజానికి నేను ఎప్పటికీ అత్యంత సంపన్నుడిని కాలేను. ఎందుకంటే, అది నా ఆశయం కాదు'' అని రిప్లై ఇచ్చారు. ఆనంద్ మహీంద్ర ఇచ్చిన జవాబు అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా చాలా మంది పారిశ్రామిక వేత్తలు దేశంలో, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిని కావాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆనంద్ మహీంద్ర ఇచ్చిన సమాధానం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆయన ఇచ్చిన సమాధానంపై ఓ నెటిజన్ స్పందిస్తూ ''గొప్పవారు దేశం గురించి, దాని అభివృద్ధికి తమ సహకారం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అంతేగానీ, అత్యంత సంపన్నుడిని కావాలని కాదు'' అని పేర్కొన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)