ఆకాశంలో వింత ఆకారం !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ లో ఉదయాన్నే ఆకాశంలో ఒక గ్రహం మాదిరిగా ఉన్న ఆకారం దర్శనమిచ్చింది. దానిని గమనించిన పలువురు తమ ఫోన్ కెమెరాలతో వీడియో తీశారు. ఇదేంటా? అని సందేహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. తెలుపు రంగులో ఉన్న ఈ వింత ఆకారాన్ని చూసి జనాలు షాక్ అయ్యారు. అది గ్రహమా? లేక ఏదైనా నక్షత్రమా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఏలియన్ షిప్ ఏమైనా భూమిని సమీపించిందా? అని దానిని గుర్తించే పనిలో పడ్డారు. అయితే కొందరు మాత్రం ఇది మార్స్ గ్రహం అని అంటున్నారు. ఇలా కొందరు గ్రహం అని, మరికొందరు స్టార్ అని, ఇంకొందరు ఏలియన్ అని రకరకాల ఊహాగాలనాలతో వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.  గ్రహం అని, స్టార్ అని, ఏలియన్స్ అని జరుగుతున్న ప్రచారానికి తెర దించారు శాస్త్రవేత్తలు. అది వెదర్ రీసెర్చ్ బెలూన్‌గా శాస్త్రవేత్తలు తేల్చారు. వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయోగించిన వెయ్యి కేజీల బరువు ఉన్న హీలియం బెలూన్ అని స్పష్టం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)