ఖరీదైన పండ్లు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 15 December 2022

ఖరీదైన పండ్లు !

జపాన్ లో కొత్త ఆవిష్కరణలు చేయడం మామూలే. పండ్ల విషయంలోనూ వీరి ప్రయోగాలు సాగాయి. అందుకే కొత్త కొత్త పంటలు వచ్చాయి. అవి మార్కెట్లో వేలల్లో ధరలు పలుకుతున్నాయి. ద్రాక్ష, కర్బూజ, ఆపిల్.. ఇలా పండ్లు ఒకేషేపులో, ఒకే సైజులో ఉండాలా? అవసరం లేదంటున్నారు జపనీయులు. కొత్తగా కొన్ని పండ్లను పండించి ప్రపంచానికి పరిచయం చేశారు. అలా ప్రపంచంలో అవి ఖరీదైన పండ్లుగా మారాయి. 

ద్రాక్ష : ఈ ద్రాక్షని రూబీ రోమన్ అని పిలుస్తారు. ఇది జపాన్ లో పండుతుంది. ఒక్కో పండు పింగ్ పాంగ్ బాల్ అంతా పెద్ద సైజులో ఉంటుంది. 2008 ఆగస్టులో మొదటిసారి దీన్ని పండించారు. అప్పుడు ఒక్క ద్రాక్ష ధర మన కరెన్సీలో 2 వేలకు పైగా పలికింది. ప్రస్తుతం దీని ధర కిలోకి 3వేల యూరోలు పలుకుతున్నది. అంటే మన కరెన్సీలో సుమారు 2, 63,463 రూపాయలు.

కర్బూజ :  ఈ పండు మామూలు కర్బూజ కాదు. యుబారీ ప్రాంతంలో ప్రత్యేకంగా పండిన పండు కాబట్టే దీనికి ఆ పేరు పెట్టారు. ఇది ఒక హైబ్రీడ్ రకం. రెండు రకాల పండ్లను జతచేస్తే పుట్టిన పండు. మంచి జరగాలంటే జపాన్ లో ఈ పండును ఇవ్వడం పరిపాటి. ఒక్క పండు ధర సుమారు 20వేల యూరోలు. అంటే 17 లక్షల రూపాయల పై మాటే.

ఆపిల్ : దక్షిణ జపాన్ లో ఈ పండు ఎక్కువగా కనిపిస్తుంది. దీని పేరు థాయూ నో టామాగో. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే ఈ చెట్లు పెరుగుతాయి. ఇవి మన దేశంలో కూడా ఈ మధ్యే పండించడం మొదలుపెట్టారు. జబల్ పూర్ లో ఒక ఫామ్ హౌస్ లో దీన్ని పెంచుతున్నారు. దీంట్లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. కిలోకి 7,500 యూరోల వరకు ఉంటుంది. అంటే 7 లక్షల రూపాయల వరకు పలుకుతుంది.

స్ట్రాబెరీస్ :  ఎర్రని రంగులో చూడచక్కని స్ట్రాబెరీలు ఆకర్షిస్తాయి. కానీ అన్ని స్ట్రాబెరీలు ఒక్కలా ఉండవని రుజువైంది. జపాన్ లో పండే సెంబికియా స్ట్రాబెరీస్ కొంత ప్రత్యేకం. కచ్చితమైన ఆకారంతో, అద్భుతమైన ఎరుపు రంగుతో దీన్ని క్వీన్ ఆఫ్ స్ట్రాబెరీస్ గా పిలుస్తారు. డిసెంబర్ లో ఈ పండ్లు చేతికి వస్తాయి. దీని ధర ఒక్కో దానికి 10యూరోలు.. అంటే 878 రూపాయలు ఉంటుంది.

పియర్ :  చైనాకి చెందిన ఒక రైతు ఆరు సంవత్సరాలు కష్టపడి ఇలాంటి పీయర్ ని పండించడం మొదలుపెట్టాడు. మౌల్డ్లో పెరిగిన వీటికి చాలా డిమాండ్ ఉంది. వియత్నాంలో ఈ పండ్లను సంతోషానికి ప్రతీకగా గుర్తిస్తారు. దీని ఒక్కో పండు ధర 7 పౌండ్లు. అంటే 615 రూపాయలు.

పుచ్చకాయ :  చతురస్రాకారంలో ఉండే పుచ్చకాయలు. నాలుగు వైపులా 19 సెంటీమీటర్లు ఉంటుంది. ఒక్కో ధర 150 పౌండ్లు. అంటే.. 13, 173 రూపాయలు.

No comments:

Post a Comment