పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగ !

Telugu Lo Computer
0


తెలంగాణలోని సూర్యాపేట పోలీస్ స్టేషన్ కు చెందిన పెట్రోలింగ్ వాహనాన్ని ఎత్తుకుపోయాడో దొంగ. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు TS 09 PA 0658 నంబరు కలిగిన పెట్రోలింగ్ వాహనాన్ని నిలిపి పక్కకు వెళ్లారు. వాహనానికి తాళం వేయడం మర్చిపోయారు. అది గమనించిన దొంగ. చక్కగా కారు తాళం తీసుకుని కారుతో సహా అక్కడ నుంచి ఉడాయించాడు. తమ వాహనం కనిపించకపోవడంతో పోలీసులు షాకయ్యారు. వెతకటం మొదలుపెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వాహనం వెళ్లిన దారిని గుర్తించారు. కోదాడ వద్ద నిలిపి ఉంచిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా కారు తాళం తీసి ఉండటంతో ఈజీగా కారును చోరీ చేసిన సదరు దొంగ కోదాడకు వచ్చేసరికి కారులోని డీజిల్ అయిపోవటంతో ఆగిపోయింది. దీంతో దొంగ వాహనాన్ని అక్కడే వదిలేశాడు. కోదాడ వద్ద దుండగుడిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)