ప్రధానికి మాతృ వియోగం

Telugu Lo Computer
0


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ (100) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్, మధ్యప్రదేశ్ సీఎం శివరజా్ సింగ్ చౌహాన్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మాజీ మంత్రి, డెమోక్రటిక్ అజాద్ పార్టీ చైర్మన్ గులాం నబీ ఆజాద్ సంతాపం తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు.  ఇటీవలే ఆమె తన వందో పుట్టిన రోజు జరుపుకున్నారు. హీరాబెన్ ఆమె చిన్న కొడుకు దగ్గర ఉంటున్నారు. తల్లి మరణవార్తతో ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు వెళ్లారు. అయితే షెడ్యూల్ ప్రకారం నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. తన తల్లి మృతి పట్ల ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. అమ్మ భగవంతుడి చెంతకు చేరిందంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరారని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ అమ్మను దేవుని చిహ్నంగా భావించానని గుర్తు చేశారు. విలువలకు కట్టుబడిన నిస్వార్థ కర్మయోగి జీవితం గడిపారని కొనియాడారు. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిదని అభివర్ణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)