యాదాద్రీశుడిని సన్నిధిలో రాష్ట్రపతి

Telugu Lo Computer
0


రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, విప్ సునీత, ఆలయ ఈవో గీతారెడ్డిలు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ యాదాద్రికి వచ్చారు. ఆలయం పునర్నిర్మాణమయ్యాక మొదటిసారిగా వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవాద్యాలు, పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి గర్భాలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువును రాష్ట్రపతి దర్శించుకున్నారు. సంకల్పం, సువర్ణపుష్పార్చన పూజల అనంతరం ఆలయ పండితులు చతుర్వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి ప్రసాదాన్ని రాష్ట్రపతికి అందజేశారు. అనంతరం ప్రధాన ఆలయ పరిసరాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిశీలించారు. అధికారులు ఆలయ విశిష్టతను ఆమెకు వివరించారు. దర్శనం అనంతరం ముర్ము హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)