కరోనా మహమ్మారికి చైనా విలవిల !

Telugu Lo Computer
0


కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్7 వల్ల చైనా విలవిలలాడుతోంది. రోజుకు లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. వందలాది మందికి ఈ కొత్త వేరియంట్ కు బలవుతున్నారు. రోజువారీ కేసులు 10 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. దీన్ని బట్టే ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చెప్పవచ్చు. అక్కడ పరిస్థితులకు సంబంధించి సోషల్ మీడియాలో బయటపడుతున్న వీడియోలు నెటిజన్ల హృదయాలను కలచివేస్తున్నాయి. ప్రతీ రోజూ వైరస్ కారణంగా వందలాది మంది చనిపోతుండటంతో అక్కడి శ్మశానవాటికల ముందు ప్రజలు అంత్యక్రియల కోసం మృత దేహాలతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూసే పరిస్థితులు తలెత్తాయి. ఆరోగ్య నిపుణుడు ఎరిక్ ఫీగల్-డింగ్ తన ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో తమ వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు గంటల తరబడి క్యూలో నిల్చుని మృతదేహాలను తీసుకెళ్తున్న దృశ్యాలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. 'శ్మశాన వాటికల వద్ద పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి. మీ ప్రియమైన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు క్యూలో గంటల తరబడి వేచి ఉండటమే కాకుండా, ఆ సమయం అంతటా వారి మృతదేహాలను మోసుకెళ్లి చేయాల్సి ఉంటుందని ఊహించుకోండి. కోవిడ్‌తో విలవిలలాడుతున్న చైనాపై సానుభూతి చూపుదాం.' అని డాంగ్ వీడియోకు క్యాప్షన్‌గా తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)