జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటన !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వచ్చారు. మూడు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా శుక్రవారం ఆయన ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీని ఆయన ప్రారంభించనున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం తొలిసారిగా రాష్ట్రానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన మూడు రోజుల పర్యటనను సీజేఐ డీవై చంద్రచూడ్ తిరుమలతో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందటే న్యూఢిల్లీ నుంచి నేరుగా తిరుపతికి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తొలుత తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీనివాస మంగాపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా నోవోటెల్ హోటల్‌కు చేరుకున్నారు. తొలిసారిగా ఆయన రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సీజేఐని మర్యాదపూరకంగా కలుసుకున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని బహూకరించారు. శాలువ కప్పి సన్మానించారు. సుమారు 20 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. ఈ భేటీ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో కార్యకలాపాలను కొనసాగిస్తోన్న హైకోర్టును కర్నూలుకు తరలింపు అంశంపై మాట్లాడినట్లు సమాచారం. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. కర్నూలులో హైకోర్టుకు శాశ్వత భవనాన్ని నిర్మించడం, జిల్లాస్థాయి కోర్టుల్లో ఖాళీల భర్తీలు వంటి అంశాలపై వైఎస్ జగన్ సీజేఐతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)