బాదం - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


బరువు తగ్గాలనుకునే వారు, అలాగే జిమ్స్ లో వర్క్ అవుట్ చేసేవారి రోజువారి డైట్ లో బాదం పప్పు ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా తేలికగా పట్టుకెళ్లడానికి కూడా వీలుగా ఉండడంతో చాలా మంది బాదం పప్పును ఇష్టపడతారు. బాదం పప్పును డైరెక్ట్ తీసుకోకున్నా, జ్యూస్ లు, డిజర్ట్స్ వంటి వాటి ద్వారా ప్రతి ఒక్కరూ కచ్చితంగా బాదాన్ని వినియోగిస్తారు. అయితే చాలా మంది బాదం పప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసేసి తింటారు. అలాగే పచ్చి బాదం పప్పు కంటే నానబెట్టిన బాదం పప్పు ద్వారానే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వాబలమైన నమ్మకం. నానబెట్టిన లేదా పచ్చి బాదం పప్పు రెండింట్లో ఏది మంచిది అని చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. కొంతమందైతే నానబెట్టిన బాదం పప్పే మంచిదని కూడా వాదిస్తుంటారు. అయితే తాజా నివేదికల్లో పచ్చి బాదం పప్పు లేదా నానబెట్టిన బాదం ఏది తిన్నా ఒక్కటే తేలింది. నానబెట్టిన బాదం పప్పు మంచిది అనే వాదన కేవలం అపోహ మాత్రమే తేలింది. బాదం పప్పు ఏ రూపంలో ఉన్నా అందులో ఉండే విటమిన్ బి 2, విటమిన్ ఈ, మెగ్నీషియం, పాస్పరస్ వంటి వాటిల్లో ఎలాంటి తేడాలు ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నానబెట్టిన బాదం పప్పు నమలడానికి సులభంగా ఉండడంతో చాలా మంది ఆ రూపంలోనే తీసుకుంటారని చెబుతున్నారు. బాదం పప్పు ఆరోగ్యకరమైన పౌష్టికాహారమని ఏ రూపంలోనైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చని సూచిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)