క్షమాపణలు చెప్పిన మమ్ముట్టి !

Telugu Lo Computer
0


యువ దర్శకుడు జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ని ప్రశంసిస్తూ మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి మాట్లాడిన మాటలు వివాదానికి కారణమయ్యాయి. దీంతో సోషల్‌ మీడియా వేదికగా మమ్ముట్టిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంతో జోసెఫ్‌కు మమ్ముట్టి క్షమాపణలు చెప్పారు. 'నిన్న జరిగిన 2018 సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దర్శకుడు జోసెఫ్‌ను ప్రశంసిస్తూ నేను చేసిన వ్యాఖ్యలు కొందరిని బాధించాయి. ఇందుకుగానూ క్షమాపణలు కోరుతున్నా. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇస్తున్నా. అందరికీ ధన్యవాదాలు' అని పోస్టు చేశాడు. జోసెఫ్ తెరకెక్కించిన తాజా చిత్రం '2018'. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల మమ్ముట్టి లాంచ్ చేశారు. ఈవెంట్‌లో భాగంగా మాట్లాడుతూ 'జోసెఫ్ తలపై ఎక్కువ జుట్టు లేకపోవచ్చు కానీ, ఆయన చాలా తెలివైనవాడు' అంటూ ప్రశంసించారు. అయితే మమ్ముట్టి మాటలను కొందరు నెగెటివ్‌గా తీసుకున్నారు. జోసెఫ్‌ను మమ్ముట్టి బాడీ షేమింగ్ చేశారంటూ విమర్శించడం మొదలు పెట్టారు. దీంతో చివరకు మమ్ముట్టి సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)