కొత్త పద్ధతులను పంచుకోవడానికి భారత్‌కు వచ్చా !

Telugu Lo Computer
0


ఢిల్లీలో జరిగిన గూగుల్‌ ఫర్‌ ఇండియా కార్యక్రమంలో సుందర్‌ పిచాయ్‌ మాట్లాడుతూ కొత్త పద్ధతులను పంచుకోవడానికి తాను భారత్‌కు వచ్చినట్లు చెప్పారు. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే 1000 భాషలను ఆన్‌లైన్‌లోకి తేవాలన్న తమ ప్రయత్నాల్లో భాగంగానే దేశీయంగా 100 భాషల్లో సెర్చ్‌ చేసే అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ప్రజలు తమ భాషలో జ్ఞానాన్ని, సమాచారాన్ని పొందేలా చేయాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. భారత్‌లో యూపీఐ ఆధారిత గూగుల్ పే సేవల్లో వాయిస్ ద్వారా 'ట్రాన్సాక్షన్ సెర్చ్‌' ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్‌ ఇండియా విజన్‌ వల్లే దేశంలో సాంకేతికత మార్పులు అత్యంత వేగంగా చోటు చేసుకున్నాయని సుందర్‌ పిచాయ్‌ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)