మా టీచర్లు మాకు కావాలి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండ లం గంట్లవెల్లి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు మా టీచర్లు మాకు కావాలి అని బడి గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. ఏడో తరగతి వరకు ఉన్న ఈ బడిలో గంట్లవెల్లితోపాటు చుట్టుపక్కల తండాలకు చెందిన మొత్తం 130 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఇక్కడి అవసరాల రీత్యా ఈ స్కూల్​ను మన ఊరు- మన బడి పథకం కింద అధికారులు ఎంపిక చేశారు. ఇందులో మొత్తం 8 మంది టీచర్లు ఉన్నారు. వీళ్లలో హెడ్మాస్టర్, మరో టీచర్ డిప్యుటేషన్​పై వెళ్లగా, మరో ఇద్దరు సెలవుపై వెళ్లినట్లు చెప్తున్నారు. ఉన్న నలుగురు టీచర్లలో ఒకరు సెలవులో ఉండటంతో మిగిలిన ముగ్గురే విధుల్లో ఉన్నారు. దీంతో పాఠాలు చెప్పేవాళ్లేరి అంటూ పిల్లలు ఆందోళన చేపట్టారు. ఇంత తక్కువ స్టాఫ్​తో అన్ని క్లాసుల పిల్లలకు పాఠాలు చెప్పడం కూడా సాధ్యంకావట్లేదని టీచర్లు తెలిపారు. ఆందోళన విషయాన్ని స్థానిక ఎంఈవో శంకర్ రాథోడ్ జిల్లా విద్యాశాఖ అధికారికి వివరించారు. ఆయన వెంటనే స్పందించి ఆ స్కూల్ టీచర్ల డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వారిని వెంటనే విధుల్లో చేరాలంటూ ఆదేశాలివ్వాలని ఏంఈవోకు చెప్పారు. దీంతో డిప్యుటేషన్​లో ఉన్నోళ్లను వెంటనే రప్పిస్తామని శంకర్ రాథోడ్ ఆ స్కూల్​ పిల్లలకు తెలియజేయడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)