ఎయిర్‌పోర్టుల్లో డిజిటల్‌ ఎంట్రీ !

Telugu Lo Computer
0


విమాన ప్రయాణాలు మరింత సాఫీగా, సులభంగా జరిగేందుకు భారత ప్రభుత్వం 'డిజీ యాత్ర' అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో గుర్తింపు కార్డు, బోర్డింగ్‌ పాస్‌ వెంట లేకపోయినా ముఖ గుర్తింపు ద్వారా ప్రయాణికులు ఎయిర్‌పోర్టు చెక్‌ పాయింట్లలోకి ప్రవేశించవచ్చు. ప్రవేశ ద్వారం, సెక్యూరిటీ చెక్‌, బోర్డింగ్‌, లగేజీ, చెక్‌ ఇన్‌ కౌంటర్ల వద్ద ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉండే కెమెరాల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ చేసుకుని ప్రయాణికులు ఆయా కౌంటర్లలోకి ప్రవేశించవచ్చు. ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రయాణికులు ముందుగా డిజీయాత్ర అప్లికేషన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలను కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా  న్యూఢిల్లీ విమానాశ్రయంలో ప్రారంభించారు. దేశంలోని ఏడు ఎయిర్‌పోర్టుల్లో డిజీయాత్ర సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. న్యూఢిల్లీ, వారాణసీ, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో గురువారం నుంచే అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌, విజయవాడ, కోల్‌కతా, పుణె విమానాశ్రయాల్లో 2023 మార్చి కల్లా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు. అనంతరం దేశంలోని మిగిలిన ఎయిర్‌పోర్టులకు ఈ సేవలను విస్తరిస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)