10 రోజుల్లో 25 మిలియన్లకు పైగా వ్యూస్ !

Telugu Lo Computer
0

 

నాసా మాజీ ఇంజనీర్, ప్రముఖ యూట్యూబర్ మార్క్ రాబర్ గుడ్డు ప్రయోగాన్ని అంతరిక్షానికి తీసుకెళ్లాడు. ఎత్తైన ప్రదేశం నుంచి గుడ్డును పడేసినా పగలకుండా ల్యాండ్ చేయడమే ఈ ప్రయోగం లక్ష్యం. అయితే, ముందుగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన దుబాయ్‌లోని బూర్జ్‌ ఖలీఫా నుంచి గుడ్డును వదలాలని ప్లాన్స్ వేశాడు. కానీ, అంతలోనే తన మనసును మార్చుకుని అంతరిక్షం నుంచి గుడ్డును విసరాలని భావించాడు. ఇంకేముందు ఆ మేరకు ప్లాన్ చేశాడు. ఈ వీడియోలో గుడ్డును ఏ విధంగా కిందకు విసురుతారు అనే పూర్తి వివరాలను పేర్కొన్నారు. ఆకాశంలోకి రాకెట్ సహాయంతో గుడ్డును తీసుకెళ్లి అక్కడి నుంచి దానిని కిందకు వదిలారు. రాకెట్ పడే చోట ఒక పరుపును ఏర్పాటు చేశారు. అయితే, అనేక ప్రయత్నాల తరువాత ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. నాసా జింనీర్ అయిన ఆడమ్ స్టెల్జ్నర్ సహాయంతో గుడ్డు పగలకుండా సక్సెస్‌ఫుల్‌గా జారవిడిచారు. అంతరిక్షం నుంచి వదిలిన గుడ్డు నేలపై పడనే పడింది. అయితే, ఆ గుడ్డు క్షేమంగా, కనీసం ఎలాంటి గీతలు కూడా లేకుండా ల్యాండ్ అయ్యింది. ఆ గుడ్డును తీసుకుని ముద్దాడాడు. అయితే, ఈ వీడియోకు 10 రోజుల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)