అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గినా, దేశీయంగా తగ్గని పెట్రోలియం ధరలు !

Telugu Lo Computer
0


అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర స్వల్పంగా తగ్గింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ఒక్కింటికి 83.20 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లో ఈ ధర 77.46 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. సోమవారం నాటితో పోల్చుకుంటే ఈ రెండు చోట్లా క్రూడ్ ధర భారీగా తగ్గింది. నాలుగు డాలర్ మేర ఈ తగ్గుదల కనిపించింది. క్రూడాయిల్ రేటు తగ్గినప్పటికీ దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఏ మాత్రం పడట్లేదు. వాటి ధరలు యధాతథంగా కొనసాగుతున్నాయి. చాలారోజులుగా క్రూడాయిల్ బ్యారెల్ ధర భారీగా తగ్గుతూ వస్తోన్నప్పటికీ- దానికి అనుగుణంగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను సవరించట్లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ పోస్ట్ చేస్తోన్నారు. ఈ పరిస్థితుల మధ్య ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే పెట్రోల్, డీజిల్ రేట్లను జారీ చేశాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలుగా నమోదైంది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)