అభివృద్ధే అజెండా !

Telugu Lo Computer
0


గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా  ఆప్ సీఎం అభ్యర్ధి ఇసుదన్ గధ్వి ఓ వార్తాచానెల్‌తో మాట్లాడుతూ పలు విషయాలు ముచ్చటించారు.  తమకు రాజకీయాలు చేతకాదని, ప్రజల కోసం పనిచేయడమే తమకు తెలుసని స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్ చీప్ అరవింద్ కేజ్రీవాల్ పట్ల గుజరాతీల్లో ఆశలు మొలకెత్తాయని, తాను ఆయన ప్రతిష్టను ఇనుమడింపచేస్తానని చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో రైతుల సమస్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అభివృద్ధి రాజకీయాలు, ఉద్యోగుల అవుట్‌సోర్సింగ్ వంటి అంశాలు ప్రధానంగా ముందుకొచ్చాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల రేసులో కాంగ్రెస్ అసలు లేనేలేదని పేర్కొన్నారు. గుజరాత్‌లో 27 ఏండ్లుగా అధికారంలో ఉన్న కాషాయ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసిందని మండిపడ్డారు. పేదలకు తమ పిల్లలు మెరుగైన విద్యను పొందే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం తాయిలాలు కాదని తేల్చిచెప్పారు. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 1, డిసెంబర్ 5న రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)