తిరుపతిలో చిరుతలు సంచారం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ, జీవకోన ప్రాంతాల్లో తరచూ చిరుత పులి సంచారం స్ధానికులకు, విద్యార్ధులకు వణుకు పుట్టిస్తోంది. ఈ రెండు ప్రాంతాలు శేషాచలం అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఉండడంతో ఆహార సేకరణకు చిరుత పులులు జన నివాసాలకు వస్తున్నాయి. జీవకోనలోని ఎల్.ఎస్.నగర్, బ్యాంక్ కాలనీ, మొండికోన, బీడీ కాలనీలో ప్రజలు చీకటి పడితే ఇండ్ల నుండి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. రాత్రి సమయంలో కుక్కలను వేటాడేందుకు అటవీ ప్రాంతం నుండి నివాసాలకు వస్తున్న చిరుత పులిని చూసిన కుక్కల అరుపులకు నిద్ర లేకుండా కాలం గడుపుతున్నారు. మనుషులపై చిరుత పులి దాడి చేయకున్నా, చిన్నారులపై దాడి చేసే అవకాశం ఉండడంతో స్ధానికులు ఆందోళనకు గురి అవుతున్నారు. అయితే చిరుత పులి సంచారాన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఆ సీసీ కెమెరాల పుటేజ్ ను అటవీ శాఖా అధికారులు చూపించి తమను కాపాడాలంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. కానీ అటవీ శాఖ చట్టం ప్రకారం ఆ ప్రాంతాల్లో కంచె వేసేందుకు వీలు లేదని అధికారులు చేతులు దులుపుకోవడంతో దిక్కు తోచని స్ధితిలో స్ధానికులు ఉన్నారు. చిరుత పులి సంచారంపై తమకు భధ్రత కల్పించాలని, అటవీ ప్రాంతం దగ్గర బోన్లు, కంచె ఏర్పాటుతో పాటు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్ధానికులు కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)