కేంద్ర సంస్థలన్నింటినీ బీజేపీ ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంది !

Telugu Lo Computer
0


భారత్ జోడో యాత్ర 71వ రోజున మహారాష్ట్రలో అకోలాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ  అగ్రనేత రాహుల్ గాంధీ  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యాత్ర ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నానని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకుందని ఆయన ఆరోపించారు. సావర్కర్ బ్రిటీష్ వారికి రాశారని భావిస్తోన్న లేఖను చదవి వినిపించారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీ, నెహ్రూ, పటేల్ బ్రిటీష్ వారికి క్షమాపణలు చెప్పలేదని, సావర్కర్ మాత్రం క్షమాపణ చెప్పారని రాహుల్ ఆరోపించారు. గాంధీ, నెహ్రూ, పటేల్‌లకు ద్రోహం చేయడంతో పాటు సావర్కర్ బ్రిటీష్ వారికి కూడా సహకరించారని కూడా రాహుల్ ఆరోపణలు చేశారు. తన పాదయాత్రను ఆపాలని చూస్తున్నారని, చేతనైతే భారత్ జోడో యాత్రను ఆపాలని ఆయన బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. 8 సంవత్సరాలుగా కేంద్రం సృష్టించిన ద్వేషం, భయానికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేపట్టామని రాహుల్ చెప్పారు. భారత్ జోడో యాత్ర అనేది ఒక ఆలోచనా తీరు అని, పనిచేసే విధానమన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా రెండు ప్రధాన సమస్యలను చూస్తున్నానని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. అలాగే రైతుల గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని రాహుల్ ఆరోపించారు. ప్రజాధనం అంతా ఎక్కడికి పోతుందని రాహుల్ ప్రశ్నించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)