డ్రైవర్ లైంగిక వేధింపులతో ఆటో నుంచి దూకిన బాలిక

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణంలో రద్దీగా ఉన్న ఒక రోడ్డులో ఓ ఆటో వేగంగా వెళ్తుండగా అందులో ప్రయాణిస్తున్న బాలికపై డ్రైవర్ లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె భయంతో వాహనం నుంచి కిందకు దూకేసింది. ఆమె కిందపడగానే అటుగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు వెంటనే అలర్ట్ అయి ఆమెను చేతుల్లోకి తీసుకోగా, అక్కడున్నవారు బాధితురాలికి సపర్యలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడి దుకాణాల్లోని సీసీ టీవీ పుటేజీలో నమోదైంది. వేగంగా వెళ్తున్న వాహనం నుంచి బాలిక కిందకు దూకడంతో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీడియోలో బాధితురాలు గిలగిల కొట్టుకోవడం కనిపించింది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సయ్యద్ అక్బర్ హమీద్ అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)