మాకు ఒక ఇల్లు కేటాయించండి !

Telugu Lo Computer
0


దాదాపు 400లకు పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి అలనాటి హీరో కాంతారావు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు.  తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గుడిబండ అనే మారుమూల గ్రామం నుంచి తెలుగుసీమాలోకి  అడుగుపెట్టి తన విలక్షణమైన నటనతో మెప్పించారు. బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో కాంతారావు శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొడుకు రాజా మాట్లాడుతూ తమ తండ్రి ఆస్తులు అమ్ముకొని లు సినిమాలు తీశారని, ఒకప్పుడు మద్రాసు బంగ్లాలో ఉన్న మేము ఇప్పుడు సిటీకి దూరంలో అద్దె ఇంట్లో ఉంటున్నామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించి మాకు ఒక ఇల్లు కేటాయించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన కాంతారావు శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, విశిష్ట అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ హాజరై కాంతారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంతారావు కుమారుడు రాజా, ఎన్నారై టిఆర్ఎస్ నాయకులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)