ఇళ్లను లూఠీ చేసి అమ్మాయిలతో ఎంజాయ్ చేశారు !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని చెన్నరాయణపట్టణంలో నివాసం ఉంటున్న అయ్యప్ప అలియాస్ మురగేష్ (36), రవి అలియాస్ చెలియా రవి (26) అనే నిందితులు బెంగళూరులోని అనేక ప్రాంతాల్లో సంచరించిన రవి, మురగేష్ అద్దె ఇండ్లు కావాలని అనేక మందిని సంప్రధించారు. అద్దె ఇండ్ల కోసం తిరిగే ముసుగులో పలు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇళ్లకు తాళాలు వేశారు అని గుర్తించిన మురగేష్, రవి చేతివాటం చూపించారు. పలు ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారు నగలు, విలువైన వస్తువులు, నగదు లూటీ చేశారు. చోరీ చేసిన బంగారు నగలు విక్రయించారు. నగలు విక్రయించిన డబ్బుతో రాత్రి పూట మద్యం సేవిస్తూ అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవారు. చోరీ చెయ్యడానికి ప్రయత్నించిన మురగేష్, రవి బెంగళూరు పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి రూ. 14 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని నందిని లేఔట్ పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)