విదేశీ పైలెట్ల నియామకానికి ఎయిర్ ఇండియా యోచన ?

Telugu Lo Computer
0


టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా వైడ్ బాడీ బోయింగ్ 777 విమానాలు నడపటం కోసం దాదాపు 100 మంది విదేశీ పైలట్‌లను నియమించాలని యోచిస్తోంది. మన దేశ పైలట్‌లతో పోలిస్తే విదేశీ పైలట్‌లకు అధిక జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యంలో ఏడు దశాబ్దాల పాటు నష్టాలను మూటగట్టుకున్న ఎయిర్ ఇండియా ఖర్చులను తగ్గించుకునేందుకు విదేశీ పైలెట్ల నియమించడం మానేసింది. దీంతో ఎయిర్ ఇండియా పైలెట్ల కొరతను ఎదుర్కొంటుంది. రాబోయే నాలుగు నెలల్లో 5 బోయింగ్ 777 విమాన సర్వీసులను ప్రవేశపెడతామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, విదేశీ పైలట్లను నియమించుకోవడానికి ఎయిర్ ఇండియా సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియా మరో కొన్ని వైడ్-బాడీ విమానాలను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ముంబై నుంచి శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ లకు నాన్‌స్టాప్ సర్వీసులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అవి రాబోయే కొద్ది వారాల్లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)