మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ

Telugu Lo Computer
0


రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మీసాలు తిప్పి అలరించారు. రాహుల్ గాంధీ గడ్డం, మీసాలు పెంచడంతో ఆయనను ఇరాక్‌ మాజీ నియంత సద్దాం హుస్సేన్‌ లా ఉన్నారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విమర్శలను పట్టించుకోకపోవడమే కాకుండా రాహుల్ బాక్సర్ విజయేందర్ సింగ్ తో కలిసి మీసాలు మెలితిప్పడం గమనార్హం. ఈ ఫొటోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు. నిన్న మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జిల్లాలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ.. ఇవాళ ఖార్గోన్ జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఖేర్దా నుంచి సనవాద్ వరకు ఆయన పాదయాత్ర జరుగుతోంది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అలాగే, మధ్యప్రదేశ్ రైతులు, కార్మికులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు రాహుల్ ను కలుస్తున్నారు. రాహుల్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో ఆయన పాదయాత్ర ఇప్పటికే ముగిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)