చేసిన పనికి డబ్బులు అడిగాడని కొట్టి మూత్రం తాగించారు !

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని సిరోహి జిల్లాకు చెందిన భరత్ కుమార్ (38) అనే దళిత వ్యక్తి ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నిందిత వ్యక్తికి సంబంధించిన ఎలక్ట్రికల్ పనిని పూర్తిచేశాడు. ఇందుకుగానూ మొత్తం రూ.21,100 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.5000 మాత్రమే ఇచ్చారు. ఎంతకీ ఇవ్వకపోవడంతో నవంబర్ 19న మధ్యాహ్న సమయంలో నిందితులకు చెందిన దాబా వద్దకు వెళ్లిన భరత్ కుమార్ మిగతా డబ్బు చెల్లించాలని కోరాడు. రాత్రి 9 గంటలకు వస్తే ఇస్తామని చెప్పి పంపించారు. దీంతో తిరిగి రాత్రి 9 గంటల సమయంలో దాబా వద్దకు వెళ్లాడు. ఎంతసేపు నిరీక్షించినా డబ్బు ఇవ్వలేదు. దీంతో విసుగెత్తుకొచ్చిన భరత్ తన డబ్బులు ఇవ్వకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో నిందితులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. నిందితుడు అక్కడే ఉన్న మరికొందరితో కలిసి బాధితుడు భరత్‌ను కిందపడేసి కొట్టారు. ఈ క్రమంలో మెడలో చెప్పుల దండ వేశారు. అంతటితో కూడా ఆగకుండా బలవంతంగా మూత్రం తాగించారు. ఈ దాడి దాదాపు 5 గంటలపాటు కొనసాగింది. నిందితుల్లో ఓ వ్యక్తి ఈ ఉదంతాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ తర్వాత వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని సిరోహి డీఎస్పీ దినేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు నవంబర్ 23న ముగ్గురు నిందితులపై బాధితుడు భరత్ కుమార్ ఫిర్యాదు చేశాడని అధికారి వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)