క్షమాపణలు చెప్పిన రాందేవ్ బాబా !

Telugu Lo Computer
0


మహిళలు బట్టలు లేకపోయినా బాగుంటారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మహిళలకు క్షమాపణ చెప్పారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలు మహిళలకు బాధించి ఉంటే క్షమించాలని కోరారు. దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారంటూ గతవారం రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాందేవ్ బాబా చేసిన ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం తీవ్రంగా మండిపడింది. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మహిళా సంఘాలతో పాటు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన రాందేవ్‌ బాబా తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేసినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ రూపాలీ చకాంకర్‌ ట్విటర్‌లో వెల్లడించారు. రాందేవ్‌ క్షమాపణ లేఖను కూడా పోస్ట్ చేశారు. మహిళలకు క్షమాపణ చెప్పిన రాందేవ్ బాబా మహిళలు ఈ సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలనే ఉద్దేశంతో వారి సాధికారత కోసమే నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'బేటీ బచావో - బేటీ పడావో' కార్యక్రమాలను నేను ప్రోత్సహిస్తాను. మహిళలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోన్న వీడియో క్లిప్‌ పూర్తిగా వాస్తవం కాదు. అయినప్పటికీ.. ఎవరైనా బాధపడినట్లయితే నేను తీవ్రంగా చింతిస్తున్నా. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నా'' అని రాందేవ్‌ బాబా ఆ నోటీసులకు సమాధానమిచ్చారు.



Post a Comment

0Comments

Post a Comment (0)