రాహుల్ గాంధీ సైకిల్ సవారీ !

Telugu Lo Computer
0


భారత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం ఇండోర్ నగరంలో సైకిలు తొక్కి రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను అబ్బురపర్చారు. మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో మోటార్‌ సైకిల్ నడిపిన రాహుల్ గాంధీ ఇండోర్‌లో పార్టీ భారత్ జోడో యాత్రలో సైకిల్ తొక్కారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చుట్టుముట్టి పూలవర్షం కురిపిస్తుండగా రాహుల్ సైకిలు తొక్కారు. యాత్రలో భాగంగా ఫుట్‌బాల్ ఆడటం, గిరిజనులతో కలిసి నృత్యం చేయడం, నడవడం, రాష్ట్రవ్యాప్తంగా స్థానికులతో సరదాగా గడపిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యాత్ర 82వ రోజు రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర సోమవారం ఉదయం ఇండోర్‌లోని బడా గణపతి చౌరహా నుంచి తిరిగి ప్రారంభమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)