కునో నేషనల్ పార్కుకి మరో రెండు చిరుతలు

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు నమీబియా నుంచి తీసుకువచ్చిన ఎనిమిది ఛీతాస్‌లలో మరో రెండు చీతాస్‌లను తాజాగా పెద్ద ఎన్‌క్లోజర్‌కు తరలించారు. 72 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న ఆడ చీతాస్‌లను  ఆషా, టిబిలిసిని ఇతర మూడు మగ చీతాస్‌లతో పాటు తరలించారు.ఆదివారం సాయంత్రం రెండు ఆడ చీతాస్‌లను పెద్ద ఎన్‌క్లోజర్‌లోని ప్రత్యేక కంపార్ట్‌మెంట్లలోకి విజయవంతంగా విడుదల చేశారు. దీంతో ఇప్పుడు పెద్ద ఎన్‌క్లోజర్‌లో ఐదు చిరుతలు ఉండగా, చిన్న ఎన్‌క్లోజర్‌లో మూడు ఆడ చీతాస్‌లు ఉన్నాయి.చిన్న ఎన్‌క్లోజర్‌లో నివసిస్తున్న మిగిలిన మూడు ఆడ చీతాస్‌లను పెద్ద ఎన్‌క్లోజర్‌లో త్వరలో విడుదల చేయాలని నిర్ణయించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)