సుప్రీంకోర్టులో నాలుగు ప్రత్యేక ధర్మాసనాల ఏర్పాటు !

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టు పనితీరు మరింత సజావుగా, సాఫీగా సాగేందుకు వీలుగా నాలుగు అంశాలపై విచారణ చేపట్టేందుకు నాలుగు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేస్తున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి  డీవై చంద్రచూడ్  తెలిపారు. వచ్చేవారం నుంచి ఈ ప్రత్యేక బెంచ్‌లు విచారణ ప్రారంభిస్తాయని చెప్పారు. క్రిమినల్ అంశాలు, ప్రత్యక్ష-పరోక్ష పన్నుల అంశాలు, భూఆక్రమణలు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్‌ను ఈ ప్రత్యేక ధర్మాసనాలు విచారిస్తాయని తెలిపారు. భారత సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ గత వారంలో ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ముందు లిస్టింగ్‌ కేసుల అంశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చే విషయంపై తాను దృష్టి సారించనున్నట్టు చెప్పారు. ఇదే సమయంలో అవసరమైతే లిస్టింగ్ షెడ్యూల్ కంటే ముందుగానే కేసులను విచారణ ముందుకు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. దేశానికి సేవ చేయడమే తన ప్రాధాన్యత అని, అది సాంకేతికత లేదా రిజిస్ట్రీ సంస్కరణలు లేదా న్యాయపరమైన సంస్కరణలు ఏవైనా కావొచ్చు. భారతదేశ పౌరులందరికీ రక్షణగా ఉంటామని చెప్పారు. కాగా, సీజేఐగా 2024 నవంబర్ 10వ తేదీ వరకూ ఆయన పదవిలో ఉంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)