గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి సువేందు అధికారి గైర్హాజర్ !

Telugu Lo Computer
0


కలకత్తా లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీవీ ఆనంద బోస్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ ఆయనతో ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు సీనియర్ మంత్రులు, వామపక్షాల తరఫున బిమన్ బోస్‌తో పాటు మాజీ గవర్నర్ గోపాల్ కృష్ణ గాంధీ హాజరయ్యారు.  భారతీయ జనత పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నేత సువేందు అధికారి గైర్హాజరయ్యారు. సువేందు అధికారి డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయన గైర్హాజర్ అయ్యారని చెబుతున్నారు. సీట్ల అరెంజ్‌మెంట్ విషయంలో అవమానపరిచిందని సువేందు భావిస్తోన్నట్లు తెలుస్తోంది. తాను ఎందుకు ఈ కార్యక్రమానికి హాజరు కావాట్లేదనే విషయాన్ని కూలంకషంగా వివరిస్తూ వరుస ట్వీట్లను చేశారాయన. ఆహ్వానితుల కోసం ఏర్పాటు చేసిన సీట్ల కేటాయింపునకు సంబంధించిన ఫొటోలను తన ట్వీట్లకు జత చేశారు. బిశ్వజిత్ దాస్ వంటి ఎమ్మెల్యేల సరసన తాను కూర్చోదలచుకోలేదని వివరించారు. 1977 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి సీవీ ఆనంద బోస్. కేరళలోని కొట్టాయం ఆయన స్వస్థలం. కొంతకాలం కిందటే పదవీ విరమణ చేశారు. ఆయనను కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌గా ఎంపిక చేసింది. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నామినేట్ చేసింది. ఇదివరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన జగ్‌దీప్ ధన్‌కర్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో లా గణేషన్‌ను గవర్నర్‌గా అపాయింట్ చేసింది. ఇప్పుడు లా గణేషన్ స్థానంలో సీవీ ఆనంద బోస్‌ను నియమించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)