అధికారంలోకి వస్తే 'అగ్నిపథ్' రద్దు

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్‌లో ఈ నెల 12న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నగ్రోటా బగ్వాన్ నియోజక వర్గంలోప్రియాంకా గాంధీ ప్రచారం నిర్వహించారు. శుక్రవారం అక్కడ జరిగిన ర్యాలీలో ప్రియాంకా మాట్లాడుతూ కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. ''అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టడమంటే అమర జవాన్లను అవమానించినట్లే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రద్దు చేస్తాం. అలాగే రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకొస్తాం. మేం ఏదైనా హామీ ఇచ్చామంటే కచ్చితంగా నెరవేరుస్తాం. ఛత్తీస్‌ఘడ్‌లో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాం. దాని ప్రకారమే రైతుల రుణాలు రద్దు చేశాం'' అని ప్రియాంక పేర్కొన్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 12న ఒకే దశలో ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల కోసం ప్రియాంకా గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)