గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాధ్వి

Telugu Lo Computer
0


మాజీ జర్నలిస్ట్, టీవీ యాంకర్ అయిన ఇసుదాన్ గాధ్వి పేరును అమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేయబోయే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పటికే అధికార బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్‭లో ప్రచారం వేగవంతం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దానిపై ఆప్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఇసుదాన్ గాధ్వికి 73 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన పేరును ఆప్ ఖరారు చేసింది. గతేడాది జూన్‭ లో  ఇసుదాన్ గాధ్వి ఆప్ పార్టీలో చేరారు. ఆప్ గుజరాత్ యూనిట్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఉన్నారు. పటీదార్ సంఘం ఆందోళనలో గోపాల్ ఇటాలియా కీలక పాత్ర పోషించారు. ఇటాలియా ద్వారకా జిల్లా పిపాలియా గ్రామంలోని ఓ రైతు కుటుంబానికి చెందినవాడు. ప్రస్తుతం, గాధ్వి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. గతంలో మీడియాలో టీవీ జర్నలిస్ట్‌గా, వీటీవీ న్యూస్ ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే వీటీవీ గుజరాతీలో ప్రముఖ వార్తా కార్యక్రమం మహామంథన్‌కి యాంకర్‌గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇసుడాన్ 1982 జనవరి 10న గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లాలోని జంఖంభాలియా పట్టణానికి సమీపంలో గల పిపాలియా గ్రామంలో జన్మించారు. అతని తండ్రి ఖేరాజ్‌భాయ్ గాధ్వి వ్యవసాయం చేసేవారు.

Post a Comment

0Comments

Post a Comment (0)