ముగ్గురు హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

Telugu Lo Computer
0


జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగ్గురు సాయుధ హైబ్రిడ్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి 3 ఏకే 47 రైఫిల్స్, 2 పిస్టల్స్, 9 మ్యాగజైన్లు, 200 రౌండ్స్ తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతనాగ్ నగరంలో ఆర్మీ, పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్‌లో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. సెర్చ్‌ ఆపరేషన్‌లో భద్రతా దళాలను పసిగట్టిన ఉగ్రవాదులు బహిరంగ కాల్పులకు పాల్పడ్డారు. అనంత్‌నాగ్ జిల్లాలో ఉదయం నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) హైబ్రిడ్ ఉగ్రవాది హతమైన సమయంలో ఈ అరెస్టులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో సాజీద్ తంత్రాయ్ అనే ఉగ్రవాది హతమయ్యాడు. గతంలో లష్కరే-ఇ-తొయిబా సంస్థలో సాజిద్‌ పనిచేశాడు. కాశ్మీర్‌లో అనేక మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నాడు. అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహరాలోని చెకీ దుడూ ప్రాంతంలో కాల్పులు ప్రారంభమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, ఆర్మీ అధికారులతో కూడిన పలు బృందాలు పనిలో ఉన్నాయి. ఉగ్రవాదులు జర్నలిస్టులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు శ్రీనగర్, అనంతనాగ్, కుల్గావ్ జిల్లాలో 10 చోట్లలో సెర్చ్ ఆపరేషన్స్‌ నిర్వహించగా.. ఉగ్రవాదులు పట్టుబడ్డట్లు తెలుస్తోంది. ఇంకా ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్‌ కొనసాగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)