కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Telugu Lo Computer
0


శ్రద్ధా వాకర్ హత్యకు లివ్ ఇన్ రిలేషన్‌షిప్ కారణమని, చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాలలోకి రాకూడదని కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ కోరారు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ నేరాలకు దారి తీస్తుందని పేర్కొంటూ, తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి భాగస్వాములతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్న చదువుకున్న అమ్మాయిలను కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ తప్పుబట్టారు.' 'అమ్మాయిలు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఎందుకు జీవిస్తున్నారు? ఇలాంటి రిలేషన్‌షిప్స్‌కు తల్లిదండ్రులు బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి ఇష్టపడకపోతే కోర్టు మ్యారేజ్ చేసుకుని కలిసి జీవించాలి. చదువుకున్న అమ్మాయిలు అలాంటి సంబంధాలలోకి రాకూడదు. శ్రద్ధా వాకర్ హత్య కేసు నుంచి నేర్చుకోవాలి. వారు తమ తల్లిదండ్రుల ఆమోదంతో ఎవరితోనైనా ఉండాలి'' అని కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఒక ట్వీట్‌లో తీవ్రంగా స్పందించారు.చౌకబారు వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రిని తొలగించాలని ప్రియాంక డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)