డిసెంబరు 6 నుంచి అంతర్జాతీయ ఆరోగ్య మహానాడు

Telugu Lo Computer
0


తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డిసెంబరు 6 నుంచి చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో అంతర్జాతీయ వైద్యుల మహానాడు జరుగనుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం వెల్లడించారు. ఎగ్మూరులో వున్న యతిరాజ్‌ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఆరోగ్యశాఖ శత వార్షికోత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ఆరోగ్యశాఖ శతవార్షికోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో వేగంగా విజృంభిస్తున్న మద్రాస్‌ ఐ వంటివాటిని నివారించేందుకు ప్రభుత్వం పటిష్ఠంగా చర్యలు చేపట్టిందన్నారు. అంతర్జాతీయ మహానాడులో పాల్గొనేందుకు 2 వేల మందికి పైగా వైద్యులు తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. అదే విధంగా 250 మందికి పైగా వైద్య శాస్త్రవేత్తలు పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్మూరు ఎమ్మెల్యే పరంధామన్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి సెంథిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)