దేశంలో వందేళ్లు దాటిన ఓటర్లు 2.5 లక్షల మంది !

Telugu Lo Computer
0


దేశంలో ప్రస్తుతం వందేళ్లు దాటిన వయోవృద్ధులు సుమారు 2.5 లక్షల మంది ఓటుహక్కు కలిగి ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం  పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం ఓటర్ల జాబితాలో 2,55,598 మంది శతాధిక వృద్ధులు ఉడటం గమనార్హం.. ప్రస్తుతం దేశంలో ఎనభై ఏళ్లు పైబడిన ఓటర్లు 1 కోటి 83 లక్షల 53 వేల 347 మంది ఉన్నారని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి ఇటీవల మరణించారు. ఈ వృద్ధుడు తన 106 సంవత్సరాల వయస్సులో బలహీనమైన శరీరంలో తన జీవితంలో చివరి ఓటు వేసి ఈ నెలలో ప్రాణాలు విడిచారు.. "నాకు తెలుసు, మరణ సమయం వచ్చింది. కానీ నేను చనిపోయేలోపు ఓటు వేయాలనుకుంటున్నాను.'' అని ఆయన వ్యాఖ్యానించిన విషయం విదితమే.. కాగా, శీతాకాలం తర్వాత భారత్‌లో ఓటర్ల సంఖ్య మళ్లీ 2 కోట్లకు చేరువైంది. యువత ఓటు వేయమని ప్రోత్సహించేందుకు జాతీయ ఎన్నికల కమిషనర్ బుధవారం పూణెలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. యువతను ఉద్దేశించి రాజీవ్ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని నగరాల కంటే పుణెలో ఓటింగ్ శాతం తక్కువగా ఉందన్నారు. సైకిల్ ర్యాలీ కార్యక్రమానికి వెళ్లేందుకు ఒక్కటే కారణం యువ తరాన్ని ఓటు వేయమని ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)