లెహంగా నచ్చక పెళ్లి రద్దు చేసుకున్న యువతి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 9 November 2022

లెహంగా నచ్చక పెళ్లి రద్దు చేసుకున్న యువతి !


ఉత్తరాఖండ్ నైనిటాల్ ప్రాంతంలోని హల్ధ్వానీలో నివాసముంటున్న ఓ యువతికి, అల్మోరా ప్రాంతంలో నివాసం ముంటున్న యువకుడి పెళ్లి నిశ్చయమైంది. నవంబరు 15న వారిద్దరి పెళ్లికి పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. యువకుడి కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజి బిజీగా ఉన్నారు. పట్టణంలోకి వెళ్లి కాబోయే కోడలి ఓ లెహంగా కొన్నారు. దానిని పెళ్లికి ముందే యువతి అందించారు. అయితే ఆ లెహంగా చూసిన యువతి.. తనకు నచ్చలేదని తెచ్చిన వారి ముఖంపైనే చెప్పేసింది. అదే విషయం అబ్బాయి వాళ్ల ఇంట్లో తెలిసింది. ఓ దుస్తుల విషయంలోనే ఇలా ప్రవర్తించిన సదరు యువతి.. భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక పెళ్లి జరిగేది లేదంటూ ఇరు వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. అలా గత నెల 30న యువకుడి బంధువులు అమ్మాయి ఇంటికి చేరుకుని లక్ష రూపాయల నగదు ఇచ్చి వివాహం రద్దు ఒప్పందానికి వచ్చారు. ఇదే విషయం ఎప్పుడైనా సాక్ష్యానికి పనికి వస్తుందంటూ.. వరుడు పెద్దలు వీడియో కూడా తీశారు. అయితే అమ్మాయి తరపువారు..మళ్లీ ఆ అబ్బాయికి తమ అమ్మాయిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. యువతి బంధువులు అబ్బాయి ఇంటికి చేరుకుని మరోసారి వివాహ ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో మరోసారి ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఇరు కుటుంబాల వాదనలు విన్న పోలీసులు.. కేసుల వరకు వెళ్లవద్దని వారికి సర్ధి చెప్పారు. చివరకి పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు ఇరువర్గాలు పోలీసుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.”లెహంగా కోసం పెళ్లినే రద్దు చేసిన ఈ మహానుభావురాలు, అత్తగారింటికి వెళ్తే.. ఇంకెంత ఘనకార్యాలు చేస్తుందో” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

No comments:

Post a Comment