నింగిలోకి దూసుకెళ్లిన 'ఆర్టెమిస్ 1'

Telugu Lo Computer
0


నాసా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మానవ రహిత రాకెట్‌ ఆర్టెమిస్ -1 ఎట్టకేలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి చంద్రునిపైకి ఆర్టెమిస్ ప్రయాణం సాగింది. షెడ్యూల్ కన్నా ఆలస్యంగా ఉదయం 01:47 గంటలకు ప్రయోగించారు. ఆర్టెమిస్‌కు ఒకదాని వెంట ఒకటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఇంధనం లీకేజీతో ఆర్టెమిస్‌కు సైంటిస్టులు మరమ్మతులు చేశారు. కౌంట్ డౌన్ నిలిపివేసి నాసా మరమ్మత్తులు పూర్తి చేసింది. ఉదయం 1:04 గంటలకు తెరిచిన రెండు గంటల లాంచ్ విండోలో సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రయోగం జరిగింది. వాల్వ్ లీక్ కారణంగా ఇంజినీర్లు మంగళవారం రాత్రి కోర్ స్టేజ్‌లోకి ద్రవ హైడ్రోజన్ ప్రవాహాన్ని పాజ్ చేయవలసి వచ్చింది, అయితే లాంచ్ ప్యాడ్‌కి పంపిన బృందం గంట తర్వాత సమస్యను పరిష్కరించింది. అనంతరం ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా గతంలో ఆర్టెమిస్ ప్రయోగం రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆర్టెమిస్ -2లో వ్యోమగాములను నాసా పంపనుందని సమాచారం. సాంకేతిక కారణాల వల్ల గతంలో రెండు ప్రయోగ ప్రయత్నాలు రద్దు కావడంతో నాసాకు మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. సెప్టెంబరు చివరలో ఫ్లోరిడాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇయాన్‌తో సహా వాతావరణ వైఫల్యాల కారణంగా లాంచ్ కూడా ఆలస్యమైంది. రాత్రి రాకెట్‌ దూసుకెళ్తుందని ప్రకటించడంతో సముద్రతీరంలో సుమారు 100,000 మంది ప్రజలు ప్రయోగాన్ని వీక్షించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)