పురుషుల్లో వీర్య కణాలు తగ్గిపోతున్నాయ్! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 16 November 2022

పురుషుల్లో వీర్య కణాలు తగ్గిపోతున్నాయ్!


ఆయుర్దాయం, ఆరోగ్యం, సంతానోత్పత్తి సామర్థ్యాలకు చాలా ముఖ్యమైన వీర్య కణాలు కొన్ని సంవత్సరాల నుంచి పురుషుల్లో క్షీణిస్తున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరుగుతుందని తెలిపింది. ఆధునిక వాతావరణం, జీవనశైలి వంటివాటికి సంబంధించిన అంతర్జాతీయ సంక్షోభానికి ఇది సూచన అని తెలిపింది. దీని పర్యవసానాలు మానవ జాతి మనుగడపై తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. ఈ అధ్యయన నివేదిక హ్యూమన్ రీప్రొడక్షన్ అప్‌డేట్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. భారత దేశంతో సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో పురుషుల్లో వీర్య కణాలు  గత కొన్ని సంవత్సరాల నుంచి తగ్గిపోతున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. 53 దేశాల్లో ఈ అధ్యయనం జరిగినట్లు తెలిపింది. గతంలో సమీక్షించని ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలోని పురుషుల వీర్య కణాల తీరుపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. అదనంగా 2011 నుంచి 2018 వరకు సమాచారాన్ని కూడా పరిశీలించినట్లు తెలిపింది. ఉత్తర అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియాలలోని పురుషుల్లో టోటల్ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ కాన్సంట్రేషన్  గతంలో కన్నా ఇప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలో క్షీణించినట్లు తాజా సమాచారం చెప్తోందని, ఈ పరిస్థితి కనిపించడం ఇదే మొదటిసారి అని తెలిపింది. 2000వ సంవత్సరం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ తగ్గుదల వేగం పెరిగినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌లోని జెరూసలెం హిబ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హగాయ్ లెవినే మాట్లాడుతూ, పురుషుల్లో వీర్య కణాల తగ్గుదల ధోరణి ఎక్కువగా కనిపిస్తున్న దేశాల్లో భారత దేశం ఒకటి అని తెలిపారు. భారత దేశానికి సంబంధించిన సమాచారం విస్తృతంగా అందుబాటులో ఉందని తెలిపారు. దీనిని పరిశీలించినపుడు వీర్య కణాల క్షీణత నిలకడగా కొనసాగుతోందని తాము కచ్చితంగా నిర్థరించామని చెప్పారు. మొత్తం మీద గత 46 ఏళ్ళలో ప్రపంచవ్యాప్తంగా 50 శాతానికిపైగా స్పెర్మ్ కౌంట్స్ తగ్గినట్లు తెలిపారు. ఇటీవలి సంవత్సరాల్లో ఈ క్షీణత వేగం పుంజుకుందని చెప్పారు. వీర్య కణాల క్షీణతకు కారణాలేమిటో ఈ అధ్యయనంలో పరిశీలించలేదు. అయితే లెవినే వేరొక పరిశోధనలో వెల్లడైన అంశాలను ప్రస్తావించారు. గర్భస్థ పిండం దశలో పునరుత్పాదక వ్యవస్థ సక్రమంగా అభవృద్ధి చెందకపోవడానికి, ఆ పిండం బిడ్డగా ఎదిగి, జన్మించిన తర్వాత జీవిత కాలం సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతినడానికి సంబంధం ఉందని తెలిపారు. మరోవైపు జీవన శైలి, వాతావరణంలోని రసాయనాలు కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరచకపోతే మానవాళి మనుగడకే ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

No comments:

Post a Comment