దూసుకొస్తున్న 'సిత్రాంగ్‌' !

Telugu Lo Computer
0


'సిత్రాంగ్‌' తుపాను దూసుకువస్తోంది. ఈ తుపాను ప్రభావంతో వచ్చే వారంలో ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ వైపు దూసుకువెళ్లే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. దీంతో పశ్చిమ బెంగాల్‌, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఉత్తర అండమాన్‌ సముద్రం, సంబంధిత ప్రాంతాలపై పరుచుకున్న అల్పపీడనం... ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ తుపానుకి సిత్రాంగ్‌గా థారుల్యాండ్‌ పేర్కొంది. థారుల్యాండ్‌ భాషలో సిత్రాంగి అంటే వదలదు అని అర్థం.

Post a Comment

0Comments

Post a Comment (0)