వచ్చే ఏడాది సెర్వవాక్స్‌ వ్యాక్సిన్‌ !

Telugu Lo Computer
0


సెర్వైకల్‌ క్యాన్సర్‌ నిరోధం కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి క్వాడ్రివాలెంట్‌ వ్యాక్సిన్‌ సెర్వవాక్‌ ఉత్పత్తిని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా వెల్లడించారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మొదలుపెట్టడం ఆలస్యమైందని ఆయన శుక్రవారం మీడియాకు తెలిపారు. సెర్వైకల్‌ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ ను కట్టడి చేయడంలో ఈ వ్యాక్సిన్‌ కీలకంగా పనిచేస్తుందని పూనావాలా చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ను విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2024లో యూనిసెఫ్‌తోపాటు ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తామన్నారు. అక్కడ గత కొన్నేండ్లుగా హ్యూమన్ పాపిలోమా వైరస్‌  వ్యాక్సిన్‌ లోటు ఉందని చెప్పారు. సెర్వవాక్స్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇప్పటికే లైసెన్స్‌ ఇచ్చిందని పూనావాలా తెలిపారు. ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ప్రతినెల పది లేదా ఇరవై లక్షల డోసులను ప్రభుత్వానికి సరఫరా చేయనున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్‌ను తక్కువ ధరకే అందిస్తామని, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి కచ్చితమైన ధరను నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)