ఇండియాలో తొలి మహిళా ట్రక్‌ డ్రైవర్‌...!

Telugu Lo Computer
0


మేఘాలయలోని షిల్లాంగ్‌కు చెందిన 35 ఏళ్ల నిరుపేద మహిళ జాయిసీ లింగ్డో. ఇంట్లో కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో అమ్మ, ముగ్గురు చెల్లెళ్ల భారం జాయిసీ భుజాలపైన పడింది. దీంతో చదువుని త్వరగా ముగించేసి వివిధ రకాల ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించసాగింది. గువహటీలోని స్టీల్‌ కంపెనీతోపాటు ఇతర కంపెనీలు, స్థానిక షాపుల్లో స్టోర్‌ మేనేజర్‌గా పనిచేసేది. ఒకపక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క తన స్నేహితుల సాయంతో సరదాగా డ్రైవింగ్‌ నేర్చుకుంది. స్టీరింగ్‌ తిప్పడం బాగా వచ్చాక ఓ స్కూల్‌ బస్‌కు డ్రైవర్‌గా చేరింది. కొంతకాలం పని చేశాక అమెజాన్‌లో ట్రక్‌ డ్రైవర్స్‌ను తీసుకుంటున్నారని తెలిసి దరఖాస్తు చేసుకుంది. ఆరేళ్ల డ్రైవింగ్‌ అనుభవం ఉండడంతో అమెజాన్‌ కంపెనీ జాయిసీని తీసుకుంది. దీంతో అమెజాన్‌ ఇండియాలో తొలి మహిళా ట్రక్‌ డ్రైవర్‌ గా నిలిచింది. గువహటీ వ్యాప్తంగా అమెజాన్‌ గూడ్స్‌ను సమయానికి డెలివరీ చేస్తూ మంచి డ్రైవర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మహిళా ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ, తనలాంటి మహిళలెందరికో కొత్త ఉపాధి మార్గాన్ని ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తోన్న జాయిసీ అమేజింగ్‌ డ్రైవర్‌గా పేరు తెచ్చుకుంటోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)