2023 డిసెంబరు దాకా ఎన్నికలే ఎన్నికలు!

Telugu Lo Computer
0


దేశంలో వచ్చే నెల హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో మొదలుకొని  2023 డిసెంబరు దాకా  ఎన్నికలే ఎన్నికలు! హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లతో మొదలయ్యే ఈ ఎన్నికల సీజన్‌ వచ్చే డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దాకా కొనసాగుతుంది. ఈ ఏడాది కాలంలో 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత నాలుగైదు నెలల విరామంతో 2024లో లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలుంటాయి. షెడ్యూల్‌ ప్రకారం జరిగితే అప్పుడే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా జరుగుతుంది.  ఇలా ఈ ఏడాదిన్నరంతా దాదాపు ఎన్నికల కోలాహలం ఉండబోతోంది. లోక్‌సభకు ముందు జరగబోతున్న ఈ పదకొండు అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు అత్యంత కీలకమైన రాష్ట్రాలున్నాయి.  గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ.  వీటిలో రాజస్థాన్‌, తెలంగాణ తప్పిస్తే మిగిలిన మూడు రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉంది. ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌ కూడా 2023 డిసెంబరులో తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళుతుంది. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్‌ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లే. వాటిని ఆ పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది ఆసక్తికరం.

Post a Comment

0Comments

Post a Comment (0)