పాదాల్లో వాపు - కారణాలు

Telugu Lo Computer
0


గంటలు గంటలు కూర్చొని చాలా మంది పని చేస్తుంటారు. దాని కారణంగా కాళ్లు, పాదాలు వాపు వస్తుంది. కూర్చోవడం వల్ల వచ్చే వాపు సాధారణ సమస్యగా పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. అయితే, ఈ వాపు అనేక కారణాల వల్ల కూడా వస్తుందట. అలాంటి సందర్భంలో కారణం తెలుసుకుని, సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.  ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే సాధారణ సమస్యలలో పాదాల వాపు ఒకటి. ఇది ఏ వయస్సు వారికైనా వస్తుంది. కూర్చున్న సమయంలో కాళ్లకు రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల అలా వాపు వస్తుంది. కాలిలోని సిరలు గురత్వాకర్షణకు వ్యతిరేకంగా పని చేస్తాయి. ఈ కారణంగా సిరల లోపల కవాటాలు సరిగా పని చేయదు. రక్త సరఫరా జరగదు. ఫలితంగా పాదంలో ఒకరకమైన ద్రవాలు చేరడం వల్ల వాపు వస్తుంది. నరాల సమస్య కారణంగా కూడా కాళ్లలో వాపు వస్తుంది. పాదాలలోని చిన్న నరాలు సరిగా పని చేయకపోవడం వల్ల కూడా పాదాలలో వాపు వస్తుంది. ఇది డిపెండెంట్ ఎడెమాకు పోలిక ఉంది. గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి కారణంగా శరీరంలో కొన్ని రకాల వ్యర్థాలు పేరకుపోతాయి. ఈ ద్రవాలు గురుత్వాకర్షణ వల్ల పాదాల్లోకి ప్రవేశిస్తాయి. అలా పాదాల్లో పేరుకుపోయి వాపు రావడానికి కారణం అవుతుంది. గర్భధారణ కూడా పాదాల వాపునకు ఒక సాధారణ కారణం. శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. అంతేకాకుండా గర్బధారణ సమయంలో తక్కువగా నడవడం, తక్కువ శారీరక కదలికల వల్ల కూడా పాదాలలో వాపు వస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)