ప్రధాని జన్ కీ బాత్ వినరు, మాన్ కీ బాతే చెబుతారు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 7 October 2022

ప్రధాని జన్ కీ బాత్ వినరు, మాన్ కీ బాతే చెబుతారు !


ప్రధాని మోడీ జన్ కీ బాత్ వినరని, మన్ కీ బాత్ మాత్రమే చెబుతారని తెలిపారు. 2022 వరకు అందరికీ ఇళ్లు ఇస్తామని మోడీ చెప్పారని, రూ.435 కోట్లతో ఆయన ఇల్లు కట్టుకున్నారని కేటీఆర్ అన్నారు.  2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలే తమ టార్గెట్ పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ పేరు మార్చామని, లోక్ సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని తెలిపారు. దేశంలో రాజకీయ శూన్యత ఉందని, జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కు మంచి స్పష్టత ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ పేరుకు జాతీయ పార్టీ అయినా దాన్ని కేవలం గుజరాతీలు నడుపుతున్నారని విమర్శించారు. గుజరాత్ మోడల్ అంతా ఫేక్ అని ప్రధాని మోడీ అసమర్థుడని ఆరోపించారు. తమకు అవకాశం వస్తే తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేసి చూపిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మద్దతు వ్యక్తమవుతోందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి కార్యక్రమాలను దేశమంతా అమలు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయన్నారు. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌ దేశానికి గుదిబండ అని.. 2024 తర్వాత ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశాలే ఎక్కువని కామెంట్ చేశారు.  వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇవ్వొచ్చని నిరూపించారని కొనియాడారు. ప్లోరైడ్ సమస్యను మిషన్ భగీరథతో పరిష్కరించామని తెలిపారు. నైజీరియా కంటే దారుణంగా భారత్ తయారవుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ద్వారా సమస్యలకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు.

No comments:

Post a Comment