కార్యకర్తను పెళ్లాడిన ఆప్ ఎమ్మెల్యే

Telugu Lo Computer
0


పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరీందర్ కౌర్ భరాజ్ పార్టీ కార్యకర్త మణ్‌దీప్ సింగ్‌తో వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. ఆయన గతంలో సంగ్రూర్ జిల్లా ఆప్ మీడియా ఇంఛార్జీగా పనిచేశారు. ఈ సమయంలో ఏర్పడిన పరిచయమే వివాహ బంధానికి దారితీసినట్లు తెలుస్తోంది. పాటియాలలోని రోరేవాల్ గ్రామంలోని ఓ గురుద్వారాలో జరిగిన నరీందర్ కౌర్-మణ్‌దీప్ వివాహానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సతీమణి గుర్ ప్రీత్ కౌర్ సహా రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. 28 ఏళ్ల నరీందర్ కౌర్ సంగ్రూర్‌లోని భరాజ్ గ్రామంలోని సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. పాటియాలాలోని పంజాబ్ యూన్సివర్సిటీలో ఆమె ఎల్ఎల్‌బీ చదివారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో నరీందర్ కౌర్ తన గ్రామంలో ఒంటరిగా ఆమ్ ఆద్మీ పార్టీ బూత్ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. నేటి సీఎం భగవంత్ మాన్ ప్రోత్సాహంతో రాజకీయాల్లో మరింత చురుకుగా పనిచేశారు. కాగా, ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంగ్రూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు నరీందర్ కౌర్ భరాజ్. కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాను 36,430 ఓట్లతో ఆమె ఓడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)