థరూర్ ధోరణిపై మధుసూదన్ మిస్త్రీ అసంతృప్తి !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూధన్ మిస్త్రీ తోసిపుచ్చారు. ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై శశిథూరర్ తరఫు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌కు ఇచ్చిన సమాధానంలో మిస్త్రీ ఘాటుగా స్పందించారు. ''మా దృష్టికి తెచ్చిన సమాచారంపై మేము సమాధానం చెప్పినప్పుడు మీరు సంతృప్తి చెందినట్టు మీ ముఖంలో ప్రస్ఫుటమయింది. మీడియా దగ్గరకు వెళ్లినప్పుడు మీ ముఖకవళికలు మరో తీరులో ఉన్నాయి. మీ విజ్ఞప్తులకు స్పందించాం. సమాధానపరచాం. మీరు కూడా సంతృప్తి చెందారు. అయినప్పటికీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఏదో కుట్ర చేసినట్టు మీడియా దగ్గరకు వెళ్లి మాట్లాడటం విచారకరం'' అని మిస్త్రీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పోల్స్‌లో అవకతవకలపై థరూర్ టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఫిర్యాదులు సహజమేననని, అయితే ఆ ఫిర్యాదులకు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించినట్టు చెప్పారు.Post a Comment

0Comments

Post a Comment (0)